Raashi Khanna: డిజైనర్ శారీలో అందాల రాశి
నార్త్, సౌత్ తో సంబంధం లేకుండా రాశీ ఖన్నా అన్ని భాషల్లో సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న రాశీ కెరీర్లో బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న రాశీ చేతిలో పలు సినిమాలున్నాయి. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా రాశీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రాశీ డిజైనర్ శారీ ధరించి ఎంతో రాయల్ గా, క్లాసీ లుక్ లో కనిపించి, మరింత అందంగా మెరిసిపోతుంది. రాశీ ఈ శారీ లుక్ లో చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.






