ఆర్బీఐ కీలక ప్రకటన… 8వ తేదీ తర్వాత కూడా
రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు కూడా ముగియనున్న వేళ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చుని పేర్కొంది. అయితే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటించే సమాయానికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని శక్తికాంత్ దాస్ తెలిపారు. అందులో రూ.3.43 లక్షల కోట్లు ఇప్పటి వరకు వెనక్కి వచ్చినట్లు తెలిపారు. వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని పేర్కొన్నారు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ కోసం సెప్టెంబర్ 30 వరకు ఇచ్చిన గడువును ఇటీవల ఆర్బీఐ పొడిగించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 7తో ఆ గడువు కూడా ముగియనుంది. అయితే 8 వ తేదీ తర్వాత ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేసుకునేందుకు వెసులుబాటు ఉందని శక్తికాంత దాస్ తెలిపారు.






