Rushie Sunak: మళ్లీ గోల్డ్‌మన్ శాక్స్‌కు రుషీ సునాక్

బ్రిటన్ మాజీ ప్రధాని రుషీ సునాక్ (Rushie Sunak) మళ్లీ వృత్తి బాట పట్టారు. అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ (Goldman Sachs)లో సునాక్ సీనియర్ సలహాదారు (అడ్వైజర్)గా చేరనున్నారని తెలిసింది. 2024 జూలైలో జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో సునాక్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) ఘోర ఓటమి పాలైంది. అనంతరం సునాక్ బ్రిటన్ ప్రధాని పదవితోపాటు పార్టీ ఆధ్యక్ష హోదా నుంచీ తప్పుకున్నారు. అయితే, రిచ్‌మాండ్, నార్త్‌అల్లెర్టన్ ఎంపీగా మాత్రం కొనసాగుతున్నారు. రాజకీయాల్లో చేరక ముందు కూడా ఆయన గోల్డ్‌మన్ శాక్స్‌లోనే పనిచేశారు. 2001-2004 మధ్యకాలంలో ఆయన కంపెనీలో తొలుత సమ్మర్ ఇంటర్న్‌గా, ఆ తర్వాత జూనియర్ అనలిస్ట్ (Junior Analyst)గా పనిచేశారు. ఇప్పుడు సీనియర్ అడ్వైజర్ హోదాలో కంపెనీ యాజమాన్యం, క్లయింట్లకు భౌగోళిక రాజకీయ, ఆర్థిక సంబంధిత అంశాలపై సలహాలు ఇవ్వనున్నారు. గోల్డ్‌మన్ శాక్స్ నుంచి లభించే పారితోషికాన్ని సునాక్ తన భార్య అక్షతా మూర్తి (Akshata Murthy ) (ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి కూతురు)తో కలిసి ప్రారంభించిన రిచ్‌మాండ్ ప్రాజెక్ట్‌కు విరాళంగా ఇవ్వనున్నారు. ఈ చారిటీ సంస్థ బ్రిటన్ వాసుల్లో గణాంక నైపుణ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది.