NASSCOM: అమెరికా సీఈవో ఫోరంపై నాస్కామ్ కసరత్తు

భారత్, అమెరికా టెక్ దిగ్గజాలు కలిసి పని చేసేలా ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ (NASSCOM) వెల్లడిరచింది. జులై 9న అమెరికా న్యూయార్క్ (New York)లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో యూఎస్ సీఈవో ఫోరం (US CEO Forum ) ను ప్రారంభించనున్నట్లు వివరించింది. కొత్త ఆవిష్కరణలు, పాలసీలు, నిపుణులను తయారు చేసుకోవడం వంటి అంశాలపై అత్యున్నత స్థాయి లో సంప్రదింపులు నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుందని నాస్కామ్ పేర్కొంది. ప్రవాస భారతీయులు, ప్రభుత్వం, పరిశ్రమ, ఇన్వెస్ట్‌మెంట్, మేధావులు, విద్యావేత్తలు మొదలైన వర్గాలను సమన్వయపర్చడం ద్వారా భారత్-అమెరికా (India-America) టెక్ భాగస్వామ్యాన్ని పటిష్టపర్చేందుకు సహాయకరంగా ఉంటుందని తెలిపింది.