ప్రపంచంలోనే ఆపిల్.. ఆగ్రస్థానం

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఆపిల్ 2.25 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ ఔట్ స్టాండింగ్ షేర్ల ఆధారంగా ఆయా కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‍ను పరిగణిస్తారు. జూన్ 11, 2011 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీలు ఇలా ఉన్నాయి. ఆపిల్ 2.108 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఆపిల్ టెక్నాలజీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. ఇక 1.938 ట్రిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ రెండో స్థానంలో ఉంది. ఇది కూడా టెక్నాలజీ సంస్థే. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. ఆ తర్వాత 1,888 ట్రిలియణ్ డాలర్లతో సౌదీ ఆరామ్‍కో మూడో స్థానంలో ఉంది. ఇది సౌదీ అరేబియా కంపెనీ. ఎనర్జీ రంగంలో ఉది. అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగిన అమెజాన్ ఇంక్ 1.691 ట్రిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇది న్స్యూమర్ డిస్క్రిషనరీ రంగంలో ఉంది.
గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.655 ట్రిలియన్ డాల్లతో ఐదో స్థానంలో ఉంది. ఇది కూడా టెక్నాలజీ కంపెనీయే. సోషల్ మీడియా (టెక్నాలజీ) దిగ్గజం ఫేస్‍బుక్ 942.77 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక చైనాకు చెందిన టెన్సెంట్ మార్కెట్ క్యాప్ 742.36 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలో ఇది ఏడో స్థానంలో ఉంది. అమెరికాకు చెందిన బ్రెక్‍షైర్ హాత్‍వే మార్కెట్ క్యాప్ 654.46 ట్రిలియన్ డాలర్లు. ఇది ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఫైనాన్షియల్ సెక్టార్. టెస్లా ఇంక్ 582.32 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇది కన్స్యూమర్ డిస్క్రిషనరీ రంగంలో ఉంది. చైనాకు చెందిన అలీబాబా 577.36 బిలియన్ డాలర్లతో పదో స్థానంలో ఉంది.