ప్రపంచంలోనే ఎత్తైన హోటల్!

ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ జే హోటల్ ను చైనా లోని షాంఘైలో ప్రారంభించారు. ఇది ప్రఖ్యాత షాంఘై టవర్‍లో 120వ అంతస్తులో ఉన్నది. షాంఘై టవర్ దుబాయ్‍లోని బుర్జ్ ఖలీఫా తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన భవనం. 2 వేల అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. మేఘాలను తాకుతూ ఉండే ఈ జే హోటల్‍లో 7 రెస్టారెంట్లు, బార్లు, స్పా, స్విమ్మింగ్ పూల్ వంటి వసతులు ఉన్నాయి. అందుకే ఈ హోటల్ ఒక్క రోజు సాదాగా గడపాలంటే రోజుకు రూ.33,376 చెల్లించాల్సిందే. ఇక ప్రత్యేక వసతులు వాడుకోవాడని ధర రూ.7.5 లక్షల పైమాటే.