ప్రపంచానికి కొత్త కుబేరుడు వచ్చాడు… రెండో స్థానంలో
ఫ్రెంచ్ వ్యాపార దిగ్గజం, ఇన్వెస్టర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను ఆయన వెనక్కి నెట్టారు. ఫోర్బస్ రియల్‌టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఎల్వీఎంహెచ్ మోయెట్ హెన్నెస్సీ లూయిస్ విటన్ చైర్మన్ బెర్నార్డ్ (72) సంపద ప్రస్తుతం 198.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. రెండో స్థానంలో నిలిచిన బెజోస్ సంపద 194.9 బిలియన్ డాలర్లు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మూడో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద 185.5 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీల షేర్ల ధరల్లో హెచ్చు తగ్గులను బట్టి వీరి సంపదలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఫోర్బస్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలోని టాప్ టెన్‌లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్‌కు చెందిన ల్వారీపేజ్, బెర్క్ షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ ఉన్నారు.






