ఇన్ స్టా యూజర్లకు మరో కొత్త ఫీచర్
మెటా కు చెందిన ప్రముఖ ఫొటో/ వీడియో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ మరో ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కామెంట్ సెక్షన్లో పోల్స్ పెట్టేలా కొత్త ఫీచర్‌ని తన యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు. సంబంధిత ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని కామెంట్ సెక్షన్‌ను మరింత ఆసక్తిగా మార్చటంపై మోటా దృష్టి సారించింది. అందులో భాగంగానే కామెంట్ సెక్షన్లో పోల్ నిర్వహించే ఫీచర్‌ని తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు కేవలం ఇన్‌స్టా స్టోరీల్లో మాత్రమే పోల్స్ నిర్వహించేందుకు అవకాశం ఉండేది. ఇకపై సాధారణ పోస్టులు రీల్స్, ఈ రెండిరటి కామెంట్ సెక్షన్లలో పోల్స్ నిర్వహించవచ్చనమ్నాట.






