స్విస్ బ్యాంకుల్లో మరోసారి భారీగా పెరిగిన.. భారతీయుల సంపద

దేశంలో ఓ పక్క పేదరికం, నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతూ ఉంటే దేశంలోని సంపన్నులు సుసంపన్నులుగా ఎదుగుతూనే ఉన్నారు. సంపాదించిన సొమ్ము స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఇలా.. స్విస్ బ్యాంకుల్లో భారతీయ సంపన్నులు దాచుకున్న సంపద మరోసారి భారీగా పెరిగింది. ఈ మేరకు ఆ దేశా జాతీయ బ్యాంక్ ఎస్‍ఎన్‍బి పేర్కొంది. దాదాపు 20 వేల 700 కోట్ల రూపాయలు స్విడ్జర్లాండ్‍లోని బ్యాంకుల్లో దాచుకున్నట్లు వెల్లడించింది. కాగా 2019లో 6 వేల 625 కోట్లు ఉన్న భారతీయుల సంపద అమాంతం పెరిగినట్లు పేర్కొంది. 2011 తరువాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. భారతీయులు దాచుకున్న సంపద అత్యధికంగా 2006లో 6.5 బిలియన్ స్విస్ ఫ్రాన్సులుగా ఉన్నట్లు తెలిపింది