ఫోర్బస్ జాబితాలో భారతీయ మహిళలు…
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ పేరుతో తాజాగా విడుదల చేసిన ఫోర్బస్ జాబితాలో ఇండో అమెరికన్ మహిళలు స్థానం సంపాదించారు. ఈ జాబితాలో అరిస్టా నెట్వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ 1.7 బిలియన్ డాలర్ల ఆస్తులతో 16వ స్థానంలో నిలవగా, సింటెల్ ఐటీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి 1 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో 26వ స్థానంలో నిలిచారు. కాన్ఫ్లయెంట్ సంస్థ వ్వవస్థాపకురాలు, మాజీ చీఫ్ టెక్నాలజీ అధికారి నేహా నార్ఖడే 925 మిలియన్ డాలర్లు, జింగో బయోవర్కస్ సహ వ్యవస్థాపకురాలు రేష్మా శెట్టి 750 మిలియన్ డాలర్ల ఆస్తులతో వరుసగా 39వ స్థానాల్లో ఉన్నారు. పెప్పికో సంస్థ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న ఇంద్ర నూయి 290 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బస్ జాబితాలో 91వ స్థానంలో నిలిచారు. కాగా ఇంద్రా నూయి గత 12 ఏండ్ల నుంచి పెప్పికో సీఈవోగా కొనసాగుతున్నారు.






