Granules:అమెరికా నుంచి గ్రాన్యూల్స్ ఔషధం రీకాల్

గ్రాన్యూల్స్ (Granules ) ఇండియా రక్తపోటును తగ్గించే మెటోప్రోలాల్ సక్సనేట్ ఎక్స్‌టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ 33,000 బాటిల్స్‌ను అమెరికన్ మార్కెట్(American market) నుంచి రీకాల్ చేసింది. తయారీ లోపాలున్నట్టు గా గుర్తించినందు వల్ల ఈ చర్య తీసుకున్నట్టు అమెరికన్ డ్రగ్ రెగ్యులేటర్ యుఎస్ఎఫ్ డీఏ ప్రకటించింది. భారత్‌లో తయారైన ఈ టాబ్లెట్లు (Tablets) పూర్తిగా నీటిలో కరగలేదని, ఇది వినియోగదారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఎఫ్‌డీఏ (FDA) తెలిపింది.