Tesla car: దేశంలో తొలి టెస్లా కారు డెలివరీ .. ఎవరు కొన్నారంటే?

విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) ఇటీవల భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ దేశంలో తొలి కారు (car) ను డెలివరీ చేసింది. తెలుగు రంగు టెస్లా మోడల్ వై కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ (Pratap Sarnaik) కొనుగోలు చేశారు. ముంబయి (Mumbai) లోని టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌లో సంస్థ ప్రతినిధులు ఈ కారు తాళాలను మంత్రికి అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి ప్రతాప్ మాట్లాడుతూ దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పర్యావరణహిత వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడిరచారు.