తొలిసారిగా ఫేస్‍బుక్ … లక్ష కోట్ల డాలర్ల

అమెరికా టెక్ దిగ్గజం ఫేస్‍బుక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ ను దాటింది. కంపెనీ షేరు విలువ 14.27 డాలర్ల లాభంతో 355.64 డాలర్లకు పెరిగింది. దీంతో ఫేస్‍బుక్ మార్కెట్ విలువ లక్ష కోట్ల డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఈ మార్క్ చేరుకున్న అమెరికాకు చెందిన ఐదో సంస్థ ఫేస్‍బుక్ కావడం గమనార్హం. ఇంతకుముందు యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ వంటి సంస్థలు ఈ మైలురాయిని చేరుకున్నాయి.