ఎక్స్ మరో కీలక నిర్ణయం.. త్వరలో
ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎక్స్‌లో మూడు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకురానుంది. బేసిక్, స్టాండర్, ప్లస్ పేరుతో వీటిని తీసుకువస్తున్నట్లు ఎక్స్ సీఈఓ లిండా యాకరినో తెలిపారు. ప్రస్తుతం ఎక్స్ ప్రీమియం కోసం యూజర్లు నెలవారీ 8 డాలర్లు చెల్లిస్తున్నారు. త్వరలో దీని స్థానంలో మూడు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పరిచయం చేయనుంది. కొత్త ప్లాన్ల ద్వారా గతంలో ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని యూజర్లను ఆకర్షించడంతో పాటు, ఆదాయం పెంచుకోవాలని ఎక్స్ భావిస్తోంది.






