ఎలాన్ మాస్క్ కు భారీ షాక్.. ఒక్క రోజులోనే
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద ఒక్క రోజులోనే భారీగా ఆవిరైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల షేర్లు భారీగా పతనం కావడంతో 1.30 లక్షల కోట్ల (16.1 బిలియన్ డాలర్ల) సంపద తగ్గిపోయింది. ఇంత సంపద తగ్గినప్పటికీ బ్లూమ్‌బర్గ్ కుబేరుల జాబితాలో 210 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మస్క్ సంపద 70 బిలియన్ డాలర్ల వరకు పెరిగింది. టెస్లా షేర్లు 9.3 శాతం నష్టపోయి 220.11 డాలర్ల వద్ద స్థిరపడిరది. టెస్లాలో మస్క్‌కు 13 శాతం వాటాలు ఉన్నాయి. జులై `సెప్టెంబర్ త్రైమాసికంలో టెస్లా నికర లాభం 44 శాతం క్షీణించడంతో మార్కెట్లో కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి.






