డక్‌డక్‌గో ఇంజన్వైపు నెటిజన్ల చూపు
వాట్సాప్‌ను కాదని సిగ్నల్ వైపు మళ్లినట్టే నెటిజన్లు సెర్చ్ ఇంజిన్‌కూ ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. తమ డేటా ప్రొఫైల్‌ను వినియోగించి వ్యాపారం చేసే సెర్చ్ ఇంజిన్లను కాదని ప్రైవసీ అందించే సెర్చ్ ఇంజిన్ల వైపు మళ్లుతున్నారు. తాజాగా డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్‌కు యూజర్లు పెరుగుతుండడం ఈ కొత్త ట్రెండ్‌ను సూచిస్తోంది. ఇతర సెర్చ్ ఇంజిన్లకు తాము భిన్నమని, అవి తనకు వచ్చే సెర్చ్ క్వెరీల ఆధారంగా యూజర్‌ను ట్రాక్ చేస్తాయని, భారీ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని కలిగి ఉన్న సెర్చ్ ఇంజిన్లు.. అడ్వర్టయిజర్లను ఆకర్షించుకునేందుకు యూజర్ల డేటా వాడుకుంటున్నాయని, కానీ తాము వాటికి దూరంగా ఉంటామని డక్‌డక్‌గో చెబుతోంది. సెర్చ్ ఇంజిన్లలో ఇచ్చే క్వెరీ ఆధారంగా థర్డ్ పార్టీ సోషల్ మీడియా యాప్‌లలో యాడ్స్ ప్రత్యక్షమవుతాయని చెబుతోంది. కానీ యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేసేలా తాము బిజినెస్ మోడల్‌ను ఉపయోగిస్తున్నామని చెబుతోంది. సాధారణంగా మనం బ్రౌజ్ చేసే వెబ్సైట్లు మాత్రమే కాకుండా థర్డ్ పార్టీ ట్రాకర్లు మన బ్రౌజింగ్, లొకేషన్, సెర్చ్, కొనుగోళ్ల వివరాలు సేకరించి మన బిహేవియరల్ ప్రొఫైల్‌ను సిద్ధంచేసుకుంటాయి. తద్వారా మనకు వ్యాపార ప్రకటనలు సూచిస్తాయి.






