అమెరికాలో డాక్టర్ రెడ్డీస్ ఔషధం

ఐకోసపెంట్ ఇథైల్ క్యాప్సూల్స్ను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అమెరికా విపణిలోకి విడుదల చేసింది. పెద్దల్లో ట్రైగ్లిజరైడ్స్ (టీజీ) స్థాయిలను తగ్గించటానికి ఈ ఔషధాన్ని సిఫారసు చేస్తున్నారు. 1 గ్రాము డోసు కల 120 క్యాప్సూల్స్ ఉండే సీసాలను డాక్టర్ రెడ్డీస్ ఆవిష్కరించింది.