NASA: ఆర్ధిక సంక్షోభంలో నాసా… 2000మందికి పైగా ఉద్యోగులకు

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా(NASA) 2,145 మంది ఉద్యోగులను సంస్థ నుండి తప్పించే సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కోతల నేపథ్యంలో ముఖ్యంగా సైన్స్, అంతరిక్ష ప్రయాణం వంటి కీలక మిషన్లపై పనిచేస్తున్న అనుభవజ్ఞులైన ఉద్యోగుల (Employees) పై ఈ ప్రభావం పడుతోంది. తొలగించబడే ఉద్యోగులలో ఎక్కువ మంది జీఎస్-13 నుంచి జీఎస్-15 స్థాయిలో ఉన్న సీనియర్ అధికారులు ఉన్నారు. వీరు ప్రభుత్వంలో ముఖ్యమైన నిర్వహణ, సాంకేతిక బాధ్యతలు నిర్వహిస్తూ, నాసా విజయవంతమైన మిషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ప్రభుత్వం వీరికి ముందస్తు పదవీవిరమణ, ద్రవ్య పరిహారం లేదా రాజీనామా రూపంలో ఆఫర్లు అందిస్తోంది. అందులో 1,818 మంది సైన్స్, అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన శాఖలలో పనిచేస్తున్నారు. మిగతా వారు ఐటీ(IT), లాజిస్టిక్స్ (Logistics) వంటి ఇతర సహాయక విభాగాల్లో ఉన్నారు.