టీఆర్ఏ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ రిపోర్ట్ 2023లో #1 స్థానంలో డెల్ ల్యాప్‌టాప్‌లు
మోస్ట్ డిజైర్డ్ మొబైల్ ఫోన్‌గా శామ్ సంగ్
విశేషమైన రీతిలో డెల్ ల్యాప్టాప్స్ 2023లో #1 మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇది అత్యంత గౌరవనీయమైన టీఆర్ఏ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ రిపోర్ట్ ద్వారా అందించబడిన ప్రత్యేకత. డెల్ ల్యాప్‌టాప్‌లు ఈ గుర్తింపును పొందడం ఇది వరుసగా మూడవ సంవత్సరం. ఈ ఘనత చాలా అరుదుగా జరుగుతుంటుంది. 16 నగరాల్లో 2500+ కంటే ఎక్కువ మంది వినియోగదారులు, ప్రభావశీలురను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఆయా బ్రాండ్లు TRA ద్వారా ఏటా ర్యాంక్ చేయబడతాయి.
ఈ సందర్భంగా టిఆర్ఎ రీసెర్చ్ సిఇఒ ఎన్. చంద్రమౌళి మాట్లాడుతూ, ‘‘వినియోగదారుల ప్రాధాన్యతల డైన మిక్ ప్రపంచంలో, మార్పు మాత్రమే స్థిరంగా ఉంటుంది. టీఆర్ఏ అధ్యయనంలో మార్కెట్‌ను తీర్చిదిద్దే కోరిక లు, ఆకాంక్షలలోని సూక్ష్మమైన మార్పులను మేం అర్థం చేసుకున్నాం. టీఆర్ఏ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్ల నివేదిక ఈ అభివృద్ధి చెందుతున్న ట్రెండ్లను గుర్తించడంలో విజయవంతమైంది. మేం పల్స్ ను నిశితంగా విశ్లేషిస్తాం. వినియోగదారుల ల్యాండ్ స్కేప్, భారతదేశంలో అత్యంత ఇష్టపడే టాప్ 1000 బ్రాండ్ల సమగ్ర జాబితాను రూ పొందించడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. ఈ నివేదిక ప్రస్తుత వినియోగదారుల మనోభావాలను ప్రతిబిం బించడమే కాకుండా వ్యాపారాల కోసం ముందుకు సాగే మార్గాన్ని ప్రకాశింపజేస్తుంది. నిజంగా ప్రతిధ్వనించే ఉ త్పత్తులు, అనుభవాలను రూపొందించడానికి ప్రజల హృదయాలతో వారికి మార్గనిర్దేశం చేస్తుంది’’ అని అన్నా రు.
2023 టాప్ 5 మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్లలో, డెల్ ల్యాప్‌టాప్‌లు 1000 బ్రాండ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి, తరువాత టైటాన్ వాచెస్, శామ్సంగ్ మొబైల్ ఫోన్లు, టాటా సాల్ట్, ఆపిల్ ఐఫోన్ ఉన్నాయి. ఈ సంవత్సరం 1000 బ్రాండ్ల ప్రముఖ జాబితాలో 121 కొత్త బ్రాండ్లు ఆవిర్భవించాయి, ఇది వినియోగదారుల ప్రాధాన్యతల డైనమిక్ స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. కొత్తగా వచ్చిన వాటిలో కొన్ని షుగర్ కాస్మటిక్స్, OLA E-బైక్స్, కార్ల్ ఇంటర్నేషనల్, ఆల్డో ఫుట్‌వేర్స్ మొదలైనవి ఉన్నాయి.
గణనీయ విజయాల్లో, పురుషుల దుస్తుల బ్రాండ్ అయిన ఒట్టో, 2023లో మోస్ట్ డిజైర్డ్ మెన్స్ వేర్ బ్రాండ్ టై టిల్‌ను కైవసం చేసుకోవడానికి 723 ర్యాంక్‌లను ఎగబాకి, ఈ రంగంలో ఎప్పటి నుంచో నిలదొక్కుకున్న పీటర్ ఇంగ్లండ్ వంటి పోటీదారులను అధిగమించింది. మోస్ట్ డిజైరబుల్ ఆడియో ఎక్విప్మెంట్స్, స్మార్ట్ వేరబుల్స్, ఇయర్‌ఫోన్స్ బ్రాండ్‌గా బోట్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. హెడ్‌ఫోన్స్ విభాగంలో pTron విజయం సాధించింది. కొత్తగా వచ్చిన షుగర్ కాస్మెటిక్స్ ఒక అద్భుతమైన ఎంట్రీనిచ్చింది. టీఆర్ఏ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్ లలో తన ప్రారంభ సంవత్సరంలోనే మోస్ట్ డిజైర్డ్ కాస్మెటిక్స్ బ్రాండ్, BB క్రీమ్, లిప్ కేర్, ఐలైనర్ బ్రాండ్ వంటి టైటిల్స్ ను పొందింది.
డిజైర్ అనే పదానికి సమాంతరంగా సాగే పరిశ్రమ ఫ్యాషన్. మహిళల దుస్తుల్లో మేడమ్, క్యాజువల్‌వేర్ లో లె వీస్, ఫార్మల్‌వేర్ అలెన్ సోలీ వంటి ప్రముఖ పేర్లను మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్లలో చేరాయి. మనీష్ మల్హోత్రా డిజై నర్ అప్పెరల్స్ కూడా ఈ సంవత్సరం ఈ జాబితాలో చేరింది.
రిటైల్‌లో, వావ్ మోమోస్ ఈ సంవత్సరం మోస్ట్ డిజైర్డ్ ఏషియన్ QSR అయింది. డి-మార్ట్ (హైపర్‌మార్కెట్ – ఇండియన్), జరా (ఫాస్ట్ ఫ్యాషన్), ఐకియా (హోమ్ ఇంప్రూవ్మెంట్), టాటా జూడియో (వాల్యూ ఫ్యాషన్), స్టార్‌బక్స్ (కేఫ్) వంటి ప్రముఖ బ్రాండ్లు, ఇంకా మరిన్ని బ్రాండ్లు వాటి జనాదరణకు అనుగుణంగా జీవించి, వాటి వర్గంలో అత్యంత ఇష్టపడే బ్రాండ్లుగా మారాయి.






