40 డాలర్లు బిల్లుకు.. 16 వేల డాలర్లు టిప్పు

రెస్టారెంటుల్లో పనిచేసే వారికి ఒక 50 రూపాయలు టిప్ ఇస్తే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. అటువంటిది ఏకంగా 16000 వేల డాలర్లు టిప్ గా వస్తే ఎలా ఫీల్ అయివుంటారో మీరే అర్ధం చేసుకోవాలి. అమెరికాలో ఓ రెస్టారెంట్లో కస్టమర్ తాను చేసిన బిల్ 40 డాలర్ల కంటే తక్కువైనా. 16000 వేల డాలర్లు టిప్ గా ఇచ్చి స్టాఫర్‍ను ఆనందానికే కాకుండా ఆశ్చర్యంలో ముంచెత్తారు. బిల్లుతో పాటు క్రెడిట్ కార్డు తీసుకున్న స్టాఫర్ అది చూసి ఒక్కసారి షాక్ అయింది. కస్టమర్ ఏదో పొరబాటు చేశాడని అతను దగ్గరకు వెళ్లి ఓ మైగాడ్ ఇది నిజామా అని అడిగింది. దానికి రెప్పాన్స్ ఇస్తూ.. అవును ఇది మీ కోసమే. మీరు చాలా కష్టపడుతున్నారంటూ బదులిచ్చాడు. ఆ టిప్‍ను ఆ షిఫ్ట్ లో వాళ్లే కాకుండా మొత్తం ఉద్యోగులంతా పంచుకున్నామని స్టాఫర్ చెప్పింది.