అమెజాన్ లో మళ్లీ కలకలం.. కమ్యూనికేషన్ డివిజన్స్ లో
ఈ-0కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో విడత లేఆఫ్స్ ప్రకటించింది. కమ్యూనికేషన్ విభాగాల్లో కొలువుల కోత చేపట్టడంతో అమెజాన్ స్టూడియోస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెరికా మ్యూజిక్ డివిజన్స్ ఉద్యోగులపై ప్రభావం పడింది. ఈ కమ్యూనికేషన్ విభాగాల్లో 5 శాతం ఉద్యోగులు లేఆఫ్స్ కారణంగా ఉద్యోగాలను కోల్పోయారు. దేశీ, అంతర్జాతీయ లొకేషన్స్‌లోని అమెజాన్ కమ్యూనికేషన్ డివిజన్స్‌లో తాజా లేఆఫ్స్ ప్రభావం చూపుతాయని డెడ్‌లైన్ రిపోర్ట్ వెల్లడించింది. లేఆఫ్స్‌తో పాటు ఉద్యోగాలు కోల్పోయని వారు 60 రోజుల పాటు రెగ్యులర్ పే, ఇతర బెనిఫిట్స్ ను పొందుతారని కంపెనీ పేర్కొంది. జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్‌తో పాటు లేఆఫ్స్ బాధితులు పరిహార ప్యాకేజ్‌కు అర్హులని తెలిపింది.






