ఫాల్కం సిటీ ఎన్నికల్లో వైకే చలమచెర్ల ఏడు కొండలు విజయం
అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ‘ఫోల్ సోమ్ సిటీ కౌన్సిల్ లో ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలిచి గెలుపును కైవసం చేసుకోనున్న వైకే చలమచెర్ల ఏడు కొండలకు నెల్లూరు జిల్లా ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరులో సామాన్య గిరిజన కుటుంబంలో ఏడుకొండలు జన్మించారు. ఇంటర్ వరకు ఇదే గ్రామంలో చదువుకున్నారు. ఆ తర్వాత ఎస్వీ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చదివారు. అనంతరం యూనివర్శిటీలో కో-ఆపరేటివ్ డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత సివిల్స్ రాసి ఐఈఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అమెరికాలో వివిధ కంపెనీల్లో పనిచేసి అమెరికా పౌరసత్వం స్వీకరించిన ఏడుకొండలు ఈ కౌన్సిల్ ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఇంకా ఆయన విజయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.






