Thimmaraju Palli TV: “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ఫస్ట్ సింగిల్ ఈ నెల 29న రిలీజ్
ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ” (Thimmaraju Palli TV). తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
తాజాగా ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన ఈ సినిమా కోసం ఛాట్ బస్టర్ సాంగ్స్ చేశారు. తమ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వస్తుందంటూ కిరణ్ అబ్బవరం అనౌన్స్ చేసిన వీడియో ప్రోమో ఆకట్టుకుంటోంది.






