అమెరికా ఫాల్కం సిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగు తేజం
నెల్లూరు జిల్లా (యానాది) గిరిజన బిడ్డకు శుభాకాంక్షలు. అగ్రరాజ్యంలో ‘ఫోల్ సోమ్ సిటీ కౌన్సిల్ లో ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలిచిన వైకే చలమచెర్ల ఏడు కొండలుగారు. విడవలూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నత విద్యని అభ్యసించి విదేశాలకు వెళ్లిన వ్యక్తి. ఎస్వీ యూనివర్సిటీ లో కో -ఆపరేటివ్ డైరెక్టర్ గా పనిచేసిన ఏడుకొండలు. 1988- 92 లో బిటెక్ పూర్తిచేసుకున్న ఏడుకొండలు గారు. చలమ చెర్ల ఏడు కొండలు గారికి అభినందన శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లాలోని విడవలూరు గ్రామంలో పేదరికం లో జన్మించి పట్టుదలతో చదువుకుని ఉన్నత స్తితికి ఎదిగారు శ్రీ చలమచెర్ల ఏడుకొండలు గారు అగ్రరాజ్యం అమెరికా లోని కాలి ఫోర్నియా రాష్ట్రానికి చెందిన ‘ఫోల్ సోమ్ కౌన్సిల్’ ఎన్నికల్లో విజయం సాదించారు శ్రీ ఏడు కొండలు గారు అమెరికా వెళ్లి వివిధ కంపెనీల్లో పనిచేశారు. ఇది వరకే ఆ దేశ పౌరసత్వం పొందిన ఆయన తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా *రాష్ట్రానికి చెందిన ‘ఫోల్సోమ్ సిటీ కౌన్సిల్’ లో మొదటి స్థానంలో నిలిచారు. ఇంకా ఆయన విజయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.






