Donald Trump: జెడి అవతారంలో డొనాల్డ్ ట్రంప్

స్టార్‌వార్స్ డే (Star Wars Day) సందర్భంగా కృత్రిమ మేధతో రూపొందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో ఫొటోను అధ్యక్ష భవనం విడుదల చేసింది. ఈసారి హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్ యూనివర్స్ లోని కండలు తిరిగిన జెడి (Jedi) అవతారంలో ట్రంప్ దర్శనమిచ్చారు. రెండు రోజుల క్రితమే దివంగత పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఫొటోతో కనిపించిన ట్రంప్‌పై ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమవడం తెలిసిందే. తాజగా జెడీ ఫోటోను సైతం జనం వదట్లేదు. చౌకబారు రాజకీయ ప్రచారంగా ఎత్తిపొడిచారు. ఆ సినిమాలో శత్రువుల దగ్గర మాత్రమే ఉండే ఎర్ర లైట్ సాబెర్‌ను ట్రంప్ పట్టుకోవడాన్ని తప్పబట్టారు. గద్దలు, అమెరికా జెండాలు (American flags) వెనుక కనిపిస్తుండగా జెడి వేషధారణతో కండలు తిరిగిన దేహంతో ట్రంప్ కనిపిస్తున్న ఫొటోను వైట్‌హౌస్ సోషల్ మీడియా వేదికపై షేర్ చేసింది.