J.D. Vance: భారత్ ప్రతిస్పందన సరైందే : జేడీ వాన్స్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పౌరులను పాకిస్థాన్ (Pakistan) మద్దతుగల ఉగ్రవాదులు (Terrorists) దారుణంగా హతమార్చిన ఘటన నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా భారత్ (India)కు మద్దతు పెరుగుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) కూడా ఉగ్రవాదం విషయంలో భారత్ పక్షానే స్పందించారు. పర్యాటకులపై ఉగ్రదాడి ఘటన దిగ్భ్రాంతికరం. దీనికి భారత్ ప్రతిస్పందించడం సరైనదే. అయితే, అది విస్తృత ప్రాంతీయ సంఘర్షణలకు దారితీయని విధంగా ఉంటుందని మేం విశ్వసిస్తున్నాం. పాకిస్థాన్ కూడా ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అని ఆశిస్తున్నాం అని జేడీ వాన్స్ వెల్లడిరచారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటంలో అమెరికా (America) అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన భరోసానిచ్చారు.