Donald Trump:భారతీయ విద్యార్థులకు మళ్లీ ట్రంప్ షాక్

అమెరికా వెళ్లాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్ (Big Beautiful Bill) యాక్ట్ కింద నాన్ ఇమిగ్రేషన్ వీసా (Non-immigrant visa ) ల ఫీజును పెంచింది. ఈ ఫీజును రూ. 26 వేలకు పెంచింది. ఇది వచ్చే ఏడాది అంటే 2026 నుంచి అమల్లోకి రానుంది. యూఎస్ వెళ్లాలనుకునే భారతీయులు (Indians) సైతం ఈ ఫీజు చెల్లించాల్సి ఉంది. యూఎస్‌లో పర్యటన, ఉన్నత విద్య, ఉద్యోగం (Job) కోసం వెళ్లే వారు ఈ ఫీజు తప్పక చెల్లించాల్సి ఉంటుంది. అయితే పర్యాటన కోసం వెళ్లే వీసా ఫీజును రూ. 16 వేల నుంచి రూ. 40 వేలకు పెంచింది. యూఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజ్ కింద 250 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 21,400 చెల్లించాలి. అయితే వీటిని వెనక్కి ఇవ్వరు. దీనికి సర్ ఛార్జ్ సైతం అదనంగా వసూల్ చేస్తారు. వీసా జారీ సమయంలో ఈ మొత్తాన్ని తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ ఫీజు ధరల్లో హెచ్చు తగ్గులు ఉండనున్నాయి.