Richard Cham Berlin: అమెరికా నటుడు చాంబర్లీన్ కన్నుమూత

1960ల్లో అత్యంత ప్రజాదరణ పొందిన డాక్టర్ కిల్‌డేర్ టీవీ సీరియల్‌తో అందరికీ సుపరిచితుడైన రిచర్డ్ చాం బర్లీన్ (Richard Cham Berlin) (90) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన హవాయి (Hawaii) లోని వైమనలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. 91వ ఏట అడుగు పెట్టడానికి కొన్ని గంటల ముందే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. షోగున్ (Shogun) , ది థోర్న్ బర్డ్స్ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించి కింగ్ ఆఫ్ ది మినీ సిరీస్ (King of the Mini Series) గా చాంబర్లీన్ మన్ననలు అందుకున్నారు.