Pakistan: పాక్ చెత్త పనిపై సమాధానం దాటేసిన అమెరికా

అమెరికా కోసం తాము దాదాపు 30 ఏళ్ల పాటు చెత్త పని చేశామని పాక్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఇష్టపడలేదు. పాక్ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ (Khawaja Asif) చేసిన వ్యాఖ్యలపై ఆ శాఖ ప్రతినిధి టామి బ్రూస్ (Tommy Bruce )ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై ఆమె ఆచితూచి స్పందించారు. మా విదేశాంగ మంత్రి ఇరుదేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడతారు. ఆ ప్రాంత సరిహద్దుల్లో పరిణామాలను మేము ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. వివిధ దశల్లో ఇరు దేశాలతో టచ్‌లో ఉన్నాం. అన్ని వర్గాలు కలిసి పనిచేసి, ఓ పరిష్కారం సాధించడాన్ని ప్రోత్సహిస్తాం. ప్రపంచం మొత్తం దీనిని గమనిస్తోంది. ఇంతకు మంచి ఈ విషయంలో నా వద్ద సమాచారం లేదు అని పేర్కొన్నారు.