డిఫాల్ట్ గండం నుంచి తప్పించుకున్న అమెరికా
అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు డిఫాల్ట్ గండం నుంచి తప్పించుకుంది. అమెరికా కాంగ్రెస్లో జరిగిన ఓటింగ్లో డెమొక్రాట్ల మెజారీటీ ఓటుతో రుణ పరిమితి పెంపు సమస్య నుంచి అమెరికా గట్టెక్కింది. అమెరికాపై ఇప్పటికే 28.9 ట్రిలియన్ డాలర్ల రుణభారం ఉంది. పరిమితికి మించి దేశం రుణాలు తీసుకోవడాన్ని విపక్ష రిపబ్లికన్లు మొదట్నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత రుణాలకు తోడు అదనంగా 2.5 ట్రిలియన్ డాలర్ల రుణం తీసుకునేందుకు, రుణ పరిమితిని పెంచుకునేందుకు అమెరికా కాంగ్రెస్ (ప్రతినిధుల సభ,సెనేట్) ఆమోదం తప్పనిసరి. దీంతో కీలకంగా మారిన ఓటింగ్లో 21`209 ఓట్లతో సంబంధిత బిల్లు ఆమోదం పొందింది. దేశ రుణ పరిమితిని తాజాగా మరో 2.5 ట్రిలియన్ డాలర్లు పెంచుకునేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపడంతో బైడెన్ సర్కార్ ఊపిరిపీల్చుకుంది.






