Donald Trump: మళ్లీ రెచ్చిపోయిన ట్రంప్.. చైనా దిగిరాకపోతే మరో

సుంకాలపై వెనక్కి తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు. సుంకాల సమానత్వం సాధిస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించబోదని పేర్కొన్నారు. చైనా (China)పై మరింతగా సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. చైనా విధించిన 34 శాతం సుంకాలను మంగళవారం (Tuesday)లోగా ఉపసంహరించుకోకపోతే బుధవారం (Wednesday) నుంచి అదనంగా 50 శాతం సుంకాలను విధిస్తాం. వారితో అన్ని రకాల చర్చలను నిలిపేస్తాం అని ట్రంప్ హెచ్చరించారు.