డొనాల్డ్ ట్రంప్ కు షికాగో కోర్టు షాక్!
అమెరికాలో ఒకవైపు అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు షికాగో కోర్టు షాక్ ఇచ్చింది. దేశంలో ప్రజా ప్రయోజన పథకాలను అర్హులైన వలసదారులకు శాశ్వత నివాస హోదానిచ్చే గ్రీన్ కార్డుల జారీపై నిషేధాన్ని విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ ఆదేశాలను దేశవ్యాప్తంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు షికాగో కోర్టు జడ్జి గేరీ ఫినర్మన్ ఆదేశాలిచ్చారు. న్యూట్రిషన్ అసిస్టెన్స్ పోగ్రామ్ (పుడ్ స్టాంప్స్), వైద్య సేవలు (మెడిక్యాడ్), హౌసింగ్ వోచర్ పథకాలకు అర్హత సాధించిన చట్టబద్ధ వలసదారులకు అమెరికా ప్రభుత్వం గ్రీన్‌కార్డులను మంజూరు చేస్తున్నది. దీనిని రద్దు చేస్తూ ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.






