ఏ అవకాశాన్ని వదిలే ప్రసక్తే లేదు : ట్రంప్
అక్రమ బ్యాలెట్ల లెక్కింపును నిలిపివేసేవరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఓటింగ్ పక్రియాలో పారదర్శకత, ఎన్నికల ధ్రువీకరణ కోసం ఏ అవకాశాన్ని వదిలే ప్రసక్తే లేదని సృష్టం చేశారు. న్యాయ పోరాటంలో ఇది ఆరంభం మాత్రమే అన్నారు. అక్రమ ఓట్ల లెక్కింపును ఆపేవరకు ఒత్తిడి కొనసాగిస్తామని చెప్పారు. న్యాయబద్ధమైన ఓట్లనే లెక్కించాలని, అక్రమ ఓట్లను ఎట్టిపరిస్థితుల్లో లెక్కించకూడదని తాము మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. తమ ప్రభుత్వంపై అమెరికా ప్రజలకు నమ్మకముందని, మేము దాన్ని నిలుపుకుంటామని చెప్పారు.






