సురక్షితంగా ధ్వంసం : జో బైడెన్
అగ్రరాజ్యం అమెరికా తన వద్ద ఉన్న దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అమెరికా తన చివరి రసాయన ఆయుధాలను సురక్షితంగా ధ్వంసం చేసిందని ఓ ప్రకటనలో వెల్లడిరచారు. 30 సంవత్సరాలకు పైగా మా వద్ద పోగై ఉన్న రసాయ ఆయుధాల నిల్వలను తొలగించడానికి యూఎస్ అవిశ్రాంతిగా పని చేసింది అని వైట్‌హౌస్ విడుదల చేసిన ప్రకటనలో బైడెన్ తెలిపారు.ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ రసాయన ఆయుధాల నిల్వలలో ఉన్న చివరి మందుగుండు సామగ్రిని సురక్షితంగా ధ్వంసం చేసిందని ప్రకటించడానికి గర్వపడుతున్నాను. రసాయనిక ఆయుధాలు లేని ప్రపంచం దిశగా ఓ అడుగు ముందుకేశాం అని పేర్కొన్నారు.






