Sai Pallavi: సాయి పల్లవితో లెజండరీ యాక్టర్ సెల్ఫీ
హీరోయిన్లలో సాయి పల్లవి(sai pallavi) సంథింగ్ స్పెషల్. క్యారెక్టర్ల విషయంలో ఎంతో సెలెక్టివ్ గా ఉంటూ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉండటం ఆమెను అందరి నుంచి డిఫరెంట్ గా నిలబెట్టింది. అంతేకాదు, సినిమా ఛాన్సుల కోసం పోటీ పడకుండా తన వద్దకు వచ్చిన ఆఫర్లనే సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది. పల్లవి అంత డిఫరెంట్ కాబట్టే ఆమెకు ఆఫర్లు క్యూ కడతాయి.
అయితే సాయి పల్లవి గురించి రీసెంట్ చాలా మంది పలుమార్లు గొప్పగా మాట్లాడిన సందర్భాలున్నాయి. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరుగుతుండగా, ఆ ఈవెంట్ లో ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఆ ఈవెంట్ నుంచి ఎన్నో ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా, అందులో ఓ స్పెషల్ ఫోటో అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేస్తోంది.
ఆ ఫోటో మరెవరిదో కాదు, సాయి పల్లవి, అనుపమ్ ఖేర్(Anupam Kher) దిగిన ఫోటోనే అది. ఆ ఈవెంట్ లో ఎంతో మంది సెలబ్రిటీలున్నాఅనుపమ్ ఖేర్ అందరినీ కాదని, సాయి పల్లవితోనే సెల్ఫీ దిగడం చూస్తే ఆమె ఎంత స్పెషల్ అనేది అర్థమవుతుంది. అంతేకాదు, ఆమెను కలవడం చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కూడా విశేషం.






