America: రూ.11 వేల కోట్ల డీల్‌కు పెంటగాన్ పచ్చజెండా… భారత్‌కు

భారత్‌కు కీలకమైన సైనిక హార్డ్‌వేర్ (Military hardware )తో పాటు లాజిస్టిక్ తోడ్పాటు వ్యవస్థల సరఫరాకు అమెరికా (America) ఆమోదం తెలిపింది. సుమారు రూ.11వేల కోట్ల ( (131 మిలియన్ డాలర్లు) విలువైన ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ (Pentagon) పరిధిలోని డిఫెన్స్ సెక్యూరిటీ కో ఆపరేషన్ ఏజెన్సీ ( డీఎస్‌సీఏ) ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. దీనిపై అమెరికా కాంగ్రెస్‌కు కూడా సమాచారాన్ని అందజేసింది. ఇరుదేశాల మధ్యనున్న బలమైన ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్‌సీఏ (DSCA) వెల్లడిరచింది. అమెరికా నుంచి సైనిక కొనుగోళ్లను మరింత పెంచాలని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న వేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించడం గమనార్హం. భారత్‌కు అందనున్న సైనిక హార్డ్‌వేర్‌ల జాబితాలో సీ విజన్ సాఫ్ట్‌వేర్, రిమోట్ సాఫ్ట్‌వేర్, ఎనలిటిక్ సపోర్ట్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది.