అమెరికా రాయబారీ కీలక వ్యాఖ్యలు.. మోదీ అమెరికాకు
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశ చరిత్రలో అమెరికాకు బాగా దగ్గరైన ప్రధాని మోదీ అని, యూఎస్ చరిత్రలో భారత్కు బాగా దగ్గరైన అధ్యక్షుడు జో బైడెన్ అని ఆయన కొనియాడారు. ఇరు దేశాల ప్రజలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వీరిరువురి మధ్య చాలా స్నేహపూరిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి, సంబంధాలకు వీరి మధ్య ఉన్న స్నేహమే కారణమని పొడిగారు. భారత్, అమెరికా మధ్య పెరుగుతున్న స్నేహపూర్వక సంబంధాలు రెండు దేశాల్లో వ్యూహాత్మక, ఆర్థిక, సాయుధ, సాంస్కృతిక సహకారంలో వృద్ధికి సహకరిస్తాయని గార్సెట్టి అన్నారు.






