అలస్కాలో డొనాల్డ్ ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలస్కా రాష్ట్రంలో విజయం సాధించారు. దీంతో ఆయనకు వచ్చిన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 217కు పెరిగింది. అలస్కాలో మూడు ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అక్కడి సెనేట్ సీటును కూడా రిపబ్లికన్ పార్టీ నిలబెట్టుకుంది. దీంతో 100 మంది సభ్యులు గల అమెరికా సెనేట్లో రిపబ్లికన్ల బలం 50కి పెరిగింది. ఇదిలా ఉంగా, జార్జియా రాష్ట్రంలో అధ్యక్ష అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 14,000 మాత్రమే ఉండడంతో, చేతి ద్వారా ఓట్లను తిరిగి లెక్కబెట్టనున్నట్టు జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్పెర్జర్ తెలిపారు. ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందినవారు. ఒకవేళ జార్జియాలో ఓడినా, బైడెన్ అధ్యక్ష పీఠానికి వచ్చే ముప్పేమీ లేదు.






