Donald Trump : ప్రపంచ దేశాలన్నింటిపైనా సుంకాల మోత

ప్రపంచంలోని అన్ని దేశాలపైనా సుంకాలను విధించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్ష విమానంలో ప్రయాణిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి భారత్ ( India) , చైనా (China) లపై సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నా యి. ఈ తేదీని ఆయన అమెరికాకు లిబరేషన్ డే (Liberation Day) గా పేర్కొంటున్నారు. కేవలం 10, 15 దేశాలపైనే ప్రతీకార సుంకాలను విధిస్తున్నామని వస్తున్న వదంతులను నమ్మవద్దు. మేం అన్ని దేశాల గురించి మాట్లాడుతున్నాం. ఎవరికీ మినహాయింపులు ఉండవు అని ట్రంప్ స్పష్టం చేశారు.