Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. దేశ భద్రత కోసమే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు సదరు నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని తనకున్న ఎగ్జిక్యూటివ్ అధికారులతో హుకుం జారీ చేశారు. దేశంలోని వాణిజ్య ట్రక్కులు (Trucks) నడిపే డ్రైవర్లందరూ ఆంగ్లంలో మాట్లాడాల్సిందేనని, ఆంగ్లంలో ప్రావీణం సంపాదించుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఇదంతా ప్రజల భద్రత, దేశ రక్షణలో భాగంగా తీసుకున్న నిర్ణయమేనని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. వృతిరీత్యా డ్రైవర్లుగా ఉన్నవారికి ఆంగ్లంలో ప్రావీణ్యం ఉండాలి. ఈ విషయంలో ఎలాంటి చర్చలకూ తావులేదు. అని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ట్రంప్ తన ఆదేశాల్లో ఆంగ్లాన్ని (English) జాతీయ అధికారిక భాషగా పేర్కొన్నారు. అంతేకాదు భాష అమలు విషయంలో గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇప్పటి నుంచి ఈ విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలని ఫెడరల్ ఏజెన్సీ (Federal agencies )లను సైతం ఆదేశించారు. తాజా ఆదేశాలతో ఆంగ్లం మాట్లాడని డ్రైవర్లకు పోలీసులు (Police) భారీ జరిమానాలు విధించే అవకాశం కలగనుంది.