Harvard University: హార్వర్డ్ కు మరో బిలియన్ డాలర్ల కోత!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University)ని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ (Federal) నిధులకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బిలియన్ డాలర్ల కోతకు సిద్ధమవుతున్నట్లు సమచారం. వైద్య పరిశోదనల (Medical research) కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య పరిశోధనల కోసం యూనివర్సిటీకి ఇచ్చే ఫెడరల్ గ్రాంట్లు (Federal grants), కాంట్రాక్టుల నుంచి బిలియన్ డాలర్లను తగ్గించాలని ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.