Donald Trump: ఇరాన్‌తో డీల్ కుదరకపోతే అదే జరుగుతుంది : ట్రంప్

ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమలోనే ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ (Iran) డీల్‌కు అంగీకరించకపోతే సైనిక చర్య (Military action) కు దిగుతామని హెచ్చరించారు. ఇరాన్ అణుఒప్పందానికి అంగీకరించక పోతే సైనిక చర్య ఉంటుందా? అని ప్రశ్నించగా, దీనికి ట్రంప్ బదులిస్తూ అవసరమైతే కచ్చితంగా ఉంటుంది. వారు న్యూక్లియర్ డీల్ (Nuclear deal ) ను అంగీకరించకపోతే సైనిక చర్యకు దిగుతాం. ఇందు లో ఇజ్రాయెల్ (Israel ) ప్రమేయం కూడా ఉంటుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఎంతో సమయం లేదన్నారు.