Donald Trump : భారత్ టారిఫ్‌లు భారీగా తగ్గించనుంది : డోనాల్డ్ ట్రంప్

అమెరికా ఉత్పత్తులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తే, ఆయా దేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే అవే తరహా ఉత్పత్తులపై అంతే (ప్రతీకార) సుంకం విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటనకు ఏప్రిల్ 2 గడువు. ఈ నేపథ్యంలో మనదేశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్(India) తన టారిఫ్‌లను భారీ ఎత్తున తగ్గించనుందని ఆయన అన్నారు. ఏళ్ల తరబడి అమెరికా (America) పై అన్యాయంగా విధిస్తున్న టారిఫ్‌లను చాలా దేశాలు తగ్గించనున్నాయి. ఐరోపా సమాఖ్య ఇప్పటికే కార్ల (Cars) పై టారిఫ్‌ను 2.5 శాతానికి తగ్గించింది అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 2 నుంచి విముక్తి దినంగా ట్రంప్ ప్రకటించడం గమనార్హం.