టెక్సాస్ సుప్రీం కోర్ట్ లో రిపబ్లికన్స్ కి చుక్క ఎదురు
టెక్సాస్ లో చాలాకాలంగా రిపబ్లికన్ బలంగా ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ సంవత్సరం అధ్యక్ష రేసు దగ్గరగా పడుతున్న సమయంలో అధ్యక్షులు ట్రంప్ పై మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు అని కొన్ని పోల్స్ ప్రచురిస్తుండగా మరికొన్ని పోల్స్ ఇద్దరూ సమానంగా ఉన్నారు అని చెప్తున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం 30 అక్టోబర్ న అమెరికా లోని నాల్గవ అతిపెద్ద నగరమైన హ్యూస్టన్ లో 10 డ్రైవ్-త్రూ ఓటింగ్ సైట్లు చట్టవిరుద్ధంగా డెమొక్రాట్లకు అనుకూలంగా పనిచేస్తున్నాయని మరియు అవి డెమొక్రాట్లకు అనుకూలంగా ఉండే ప్రదేశాలలో ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఆ 10 డ్రైవ్-త్రూ ద్వారా 120,000 కు పైగా టెక్సాస్ ఓటర్లు వేసిన ఓట్లు చెల్లవు అని రిపబ్లికన్ల టెక్సాస్ సుప్రీం కోర్ట్ లో కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే టెక్సాస్ సుప్రీంకోర్టు ఆదివారం 1 నవంబర్ న రిపబ్లికన్లు హ్యూస్టన్ లో 10 డ్రైవ్-త్రూ ఓటింగ్ సైట్లు ద్వారా వివిధ ప్రదేశాలలో ఓటర్లు వేసిన 120,000 కంటే ఎక్కువ ఓట్లను రద్దు చెయ్యాలి అన్న ప్రయత్నాన్ని ఖండిస్తూ ఓటర్లు వేసిన ప్రతి ఓటు ను లెక్కించాలి సిందిగా తీర్పు వెల్లడించింది.






