Marco Rubio: రష్యాపై ఆంక్షలు తొలగించడం లేదు : మార్కో రూబియో

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మాస్కోతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని భావిస్తూ, ఆ దేశంపై గతంలో విధించిన ఆంక్షలను తొలగించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) ఖండిరచారు. రష్యా (Russia)పై ఆంక్షలు ఎత్తివేతకు సంబంధించి ఆ దేశంతో అగ్రరాజ్యం చర్చలు జరుపుతున్నట్లు రూబియో పేర్కొన్నారు. ఇది పూర్తిగా మీడియా విధానంలో అవకతవలని విమర్శించారు. ఈ వార్త పూర్తిగా అవాస్తవం. ఉక్రెయిన్ (Ukraine)లో శాంతి నెలకొల్పిన నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు ఎత్తివేత్తలపై నేను లేక, పశ్చిమాసియాలో యూఎస్ రాబారి స్టీవ్ విట్‌కాఫ్(Steve Witkoff) గానీ ఎలాంటి చర్చలు చేయలేదు అని రూబియో పేర్కొన్నారు.