Donald Trump: అమెరికా ఎన్‌ఎస్‌ఏ వాల్జ్‌పై ట్రంప్ వేటు

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైక్ వాల్జ్ (Mike Walz )పై వేటు పడిరది. ఆయనను ఐక్యరాజ్య సమితి రాయబారిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నియమించారు. వాల్జ్ స్థానంలో తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారుగా విదేశాంగశాఖ మంత్రి రుబియో (Rubio)ను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. యెమెన్ (Yemen)లోని హూతీ తిరుగుబాటుదారులపై దాడులకు సంబంధించిన సమాచారం ముందుగానే సిగ్నల్ యాప్ చాట్ (Signal App Chat) ద్వారా ఓ పాత్రికేయుడికి చేరింది. తాను అధికారులతో క్రియేట్ చేసిన గ్రూపులో పొరపాటున ఆ పాత్రికేయుడిని వాల్జ్ చేర్చారు. దీనికి తనదే బాధ్యతని ఆ తర్వాత ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను తొలగిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.