Mukesh Ambani :ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అంబానీ దంపతులు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణస్వీకారోత్సవం సోమవారం జరగనుండగా, ఒక రోజు ముందుగా ఆయన్ను రిలియన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani), ఆయన భార్య నీతా అంబానీ (Nita Ambani ) కలిశారు. ట్రంప్ ఇచ్చిన క్యాండిల్‌లైట్ విందు(Candlelight dinner) కు ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రముఖులనే ఆహ్వానించారు. ఇందులో అంబానీ దంపతులు ఉన్నారు. మన దేశం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయులు అంబానీ దంపతులు మాత్రమే. అమెరికా ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన జేడీ వాన్స్( JD Vance), ఉషా వాన్స్(Usha Vance) లను కూడా వీరు కలిశారు. జనవరి 20న (నేడు ) జరగనున్న అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కుటుంబం నుంచి అంబానీ దంపతులకు ఆహ్వానం అందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.