జో బైడెన్ బృందంలో 20 మంది భారతీయులు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన ఏజెన్సీ సమీక్ష బృందంలో 20 మందిపైనే భారతీయులను నియమించుకున్నారు. వీరిలో ముగ్గురు టీం లీడర్లు ఉన్నారు. ప్రస్తుత పాలకవర్గం నుంచి నూతన పాలకవర్గానికి అధికార బదిలీ సజావుగా జరిగేందుకు కీలక ఫెడరల్ ఏజెన్సీ కార్యకలాపాలను ఈ సమీక్ష బృందం పరిశీలిస్తుంది. మొత్తం వంద మంది ఈ సమీక్ష బృందంలో ఉన్నారు. వీరిలో సగం కన్నా ఎక్కువ మంది మహిళలే ఉండడం విశేషం. స్టాన్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన అరుణ్ మజుందార్, ఇంధన విభాగానికి టీం లీడర్‌గా నియమితులయ్యారు. అలాగే జాతీయ డ్రగ్ కంట్రోల్ విధాన విభాగానికి రాహుల్ గుప్తా, సిబ్బంది నిర్వహణ విభాగానికి కిరణ్ అహూజాను టీం లీడర్లుగా నియమించారు.






