మెలానియా ట్రంప్ సాహసోపేతమైన చర్య
శ్రీమతి మెలానియా ట్రంప్ మార్-ఎ-లాగోకు ఉత్తరాన రెండు మైళ్ళ దూరంలో ఉన్న ఒక కమ్యూనిటీ సెంటర్లో వ్యక్తిగతంగా ఓటు వేయడానికి ఎంచుకున్నారని అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే పామ్ బీచ్‌లోని మోర్టన్ మరియు బార్బరా మాండెల్ రిక్రియేషన్ సెంటర్లో ఓటు వేయడానికి కేటాయించిన రెండు ఆవరణలలో డెమొక్రాట్ల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ రిపబ్లికన్లు ఉన్న సెంటర్లో మాస్క్ తప్పనిసరి ఆదేశం, కేవలం ఒక వ్యక్తి కి అనుమతి వంటి భారీగా భద్రత చెరియలు ఏర్పాటు చేసినప్పటికీ శ్రీమతి మెలానియా ట్రంప్ మాస్క్ లేకుండా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తో కలిసి వచ్చి ఓటు వేశారు. శ్రీమతి మెలానియా ట్రంప్ కు గత నెలలో కోవిడ్ -19 నిర్ధారణ అయినప్పటికీ మాస్క్ లేకుండా ప్రజలలోకి రావడం, ఓటు వేసిన తర్వాత విలేకరులకు చేతులు ఊపుతూ, నవ్వుతూ శ్రీమతి మెలానియా ట్రంప్ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఆమెకు ఆనందం గా ఉన్నట్లు తెలిపటం చర్చనీయాంశంగా మారింది.






