Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై నిరసనల గర్జన

దేశాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నడిపిస్తున్న తీరుపై అమెరికా జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన తీరును నిరసిస్తూ దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. న్యూయార్క్ (New York) నుంచి అలస్కా (Alaska) దాకా వీధుల్లో జనం పోటెత్తి హ్యాండ్సాప్ అంటూ నినదించారు. రిపబ్లికన్ల పాలన ప్రారంభమయ్యాక తిరిగి అతి పెద్ద నిరసనగా ఇది నిలిచింది. గతంలోనూ నిరసనలు జరిగినా ఈ సారి జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. పౌర హక్కుల సంఘాలు, కార్మిక యూనియన్లు (Labor unions), స్వలింగ సంపర్క సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజెన్ (Senior Citizen), ఎన్నికల సంస్కరణలు తదితర 150 సంఘాల ఆధ్వర్యంలో 50 రాష్ట్రాల్లోని 1,200 ప్రాంతాల్లో చేపట్టిన ఈ హ్యాండ్సాఫ్ ఆందోళనలకు జనం వెల్లువెత్తారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.